Jayalalithaa: జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో 28 రకాల ఖరీదైన వస్తువుల మాయం

Among the assets seized from Jayalalithaa 28 types of expensive items were lost

  • ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయ నుంచి పలు ఖరీదైన వస్తువుల స్వాధీనం
  • 30 కేజీల బంగారం, వజ్రాభరణాలు తప్ప మిగతావి మాయం
  • తమిళనాడు అవినీతి నిరోధక శాఖకు కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది లేఖ

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న వాటిలో కొన్ని ఖరీదైన వస్తువులు కనిపించకపోవడం కలకలం రేపుతోంది. ఈ కేసులో 1996లో ఆమె నుంచి 30 కేజీల బంగారం, వజ్రాభరణాలు సహా మరెన్నింటినో స్వాధీనం చేసుకున్నారు. అయితే, వీటిలో ఈ రెండు తప్ప మిగతా 28 రకాల ఖరీదైన వస్తువులు మాయమైనట్టు తమిళనాడు అవినీతి నిరోధక శాఖకు కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది లేఖ రాశారు. 

జయకు చెందిన 11,344 ఖరీదైన చీరలు, 250 శాలువాలు, 750 జతల పాదరక్షలు, గడియారాలు తదితర 28 రకాల వస్తువుల జాడ లేదని, అవెక్కడున్నాయో తెలియదని అందులో పేర్కొన్నారు. అవి కనుక మీ అధీనంలో ఉంటే వాటిని కర్ణాటక కోర్టులో అప్పగించాలని కోరారు. బెంగళూరు సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ వస్తువుల వేలానికి ప్రభుత్వం తరపున న్యాయవాది నియమితులైన తర్వాత పలు ఖరీదైన వస్తువులు మాయం అయిన విషయం వెలుగులోకి వచ్చింది.

  • Loading...

More Telugu News