Niharika Konidela: విడాకులపై తొలిసారి స్పందించిన కొణిదెల నిహారిక!

Konidela Niharika first response after divorce
  • భర్త చైతన్యతో విడాకులు తీసుకున్న నిహారిక
  • పరస్పర అంగీకారంతో విడిపోయామన్న మెగా డాటర్
  • వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ప్రైవసీని కోరుకుంటున్నానని విన్నపం
మెగా డాటర్ కొణిదెల నిహారిక, ఆమె భర్త చైతన్య జొన్నలగడ్డలకు కూకట్ పల్లిలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి విడాకులు గత నెలలోనే మంజూరు అయినట్టు, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు విడాకులపై నిహారిక తొలిసారి స్పందించింది.  

పరస్పర అంగీకారంతోనే తాను, చైతన్య విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నామని నిహారిక ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. ఇది చాలా సున్నితమైన సమయమని... తమను ఇబ్బంది పెట్టొద్దని కోరుతున్నానని చెప్పింది. తనకు మద్దతుగా నిలిచిన తన కుటుంబానికి, స్నేహితులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొంది. తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి కొంత ప్రైవసీ కోరుకుంటున్నానని చెప్పింది. 
Niharika Konidela
Divorce
Tollywood

More Telugu News