Supreme Court: వైఎస్ వివేకా పీఏ పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
- వివేకా హత్య కేసులో తనను బాధితుడిగా పరిగణించాలంటూ కృష్ణారెడ్డి పిటిషన్
- దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని సవాల్ చేసే అధికారం ఉన్నట్లు ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి
- కృష్ణారెడ్డి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ధర్మాసనం
- ఇరువర్గాలు తమ వాదనలను హైకోర్టు ఎదుట చెప్పుకోవాలని సూచన
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన పీఏ కృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనను బాధితుడిగా పరిగణించాలంటూ ఆయన వేసిన పిటిషన్ ను భారత అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని సవాల్ చేసే అధికారం తనకూ ఉన్నట్లు ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. అయితే సుప్రీంకోర్టు దీనిని తోసిపుచ్చింది. ఈ కేసులో జోక్యానికి సిద్ధంగాలేమని వెల్లడించింది.
ఇరువర్గాలు తమ వాదనలను హైకోర్టు ఎదుట చెప్పుకోవాలని సూచించింది. దీనిపై తమ అభిప్రాయాలతో సంబంధం లేకుండా హైకోర్టు స్వతంత్రంగా తగిన నిర్ణయం తీసుకోవచ్చునని స్పష్టం చేసింది. రేపు దీనికి సంబంధించి లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది.