Diabetes: మధుమేహానికి కొత్త సూచన.. నోటి దుర్వాసన!

Diabetes new symptoms has increased tension about the diabetes disease
  • అసాధరణ వాసన వస్తుంటే టెస్ట్ చేయించుకోవాలంటున్న నిపుణులు
  • సాధారణ లక్షణాలు.. అధిక దాహం, ఆకలి, బరువు తగ్గడం
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా అదుపు చేసుకోవచ్చని సూచన
శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిలో హెచ్చుతగ్గుల వల్ల వచ్చే అనారోగ్య సమస్య మధుమేహం (డయాబెటిస్).. ఇది రెండు రకాలని వైద్యులు చెబుతున్నారు. టైప్ 1, టైప్ 2 మధుమేహం. టైప్ 1 మధుమేహంలో ఇన్సులిన్ ఉత్పత్తి సరిపడా లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరిగిపోతాయి. ఉత్పత్తి అయిన ఇన్సులిన్ ను శరీరం సరిగా ఉపయోగించుకోలేకపోవడం వల్ల టైప్ 2 మధుమేహం సమస్య ఎదురవుతుంది. మధుమేహ బాధితులలో సాధారణంగా కనిపించే లక్షణాలు.. అధిక దాహం, అధిక ఆకలి, శక్తి కోల్పోవడం, బరువు తగ్గడం మొదలైనవి. అయితే, తాజాగా మధుమేహం బారిన పడుతున్న వారిలో కొత్త లక్షణాన్ని గుర్తించినట్లు నిపుణులు వెల్లడించారు. అది నోటి దుర్వాసన.. నోటిలో నుంచి వాసన వస్తుందంటే మధుమేహానికి సంకేతమని, డయాబెటిస్ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.

డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుకోవడానికి సమతుల ఆహారం తీసుకోవడం అన్నింటికన్నా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. చక్కెర, ప్రాసెస్ చేసిన, ఆహారాలకు దూరంగా ఉండాలని, తాజా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. దీంతో పాటు క్రమం తప్పకుండా వాకింగ్, రన్నింగ్, యోగా, స్విమ్మింగ్ వంటి రోజువారీ వ్యాయామాలు చేయడం ద్వారా మధుమేహాన్ని అదుపు చేయవచ్చంటున్నారు.
Diabetes
new symptom
bad smell
Health

More Telugu News