Maruti: తమ కంపెనీలోనే అత్యంత ఖరీదైన కారును విడుదల చేసిన మారుతి
- 7 సీటర్ ఇన్విక్టో మల్టీ పర్పస్ వెహికల్ ప్రారంభం
- రూ. 24.8 లక్షల నుంచి రూ.28.4 లక్షల రేటు
- ఇన్నోవా హైక్రాస్ కు ఇది రీబ్యాడ్జ్ వెర్షన్
భారత్ లో మధ్యతరగతి వారికి అందుబాటు ధరల్లో కార్లను అందించే కంపెనీల్లో మారుతి సుజుకీ ముందుంటుంది. దేశంలో అత్యధిక కార్లు అమ్ముడయ్యే కంపెనీ కూడా ఇదే. మారుతున్న అవసరాలకు తగ్గట్టుగా ప్రీమియం కార్లపైనా మారుతి దృష్టి పెట్టింది. ఈ క్రమంలో భారత్ లో తమ కంపెనీ నుంచి అత్యధిక ఖరీదైన కారు ఇన్విక్టోని ప్రవేశ పెట్టింది. ఈ మల్టీ పర్పస్ వెహికల్ (ఎంపీవీ) ధర రూ.24.8 లక్షల నుంచి రూ.28.4 లక్షల మధ్య ఉంది. జెటా (7 సీడర్), జెటా ప్లస్ (8 సీటర్), ఆల్ఫా (7 సీజర్) అనే మూడు వేరియంట్లలో ఈ మోడల్ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ కారు ప్రాథమికంగా గతేడాది వచ్చిన టయోటా ఇన్నోవా హైక్రాస్ కి రీబ్యాడ్జ్ చేసిన వెర్షన్. మారుతి–టయోటా కిర్లోస్కర్ మధ్య ఏడేళ్ల నుంచి భాగస్వామ్యం ఉంది. దేశీయ ఎంపీవీ సెగ్మెంట్లో మారుతికి 50 శాతం వాటా ఉంది. ఇన్విక్టోలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ముందు, వెనుక డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. అలాగే, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌లు, ఏబీఎస్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి రక్షణ ఫీచర్లు ఇన్విక్టోలో ఉన్నాయి. నాలుగు రంగుల్లో ఇవి అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.