Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగానికి ముహూర్తం ఖరారు చేసిన ఇస్రో

ISRO fixes time for Chandrayaan3

  • జులై 14న నింగిలోకి దూసుకెళ్లనున్న చంద్రయాన్-3
  • మధ్యాహ్నం 2.35 గంటలకు నింగిలోకి జీఎస్ఎల్వీ-ఎంకే3/ఎల్వీఎమ్3
  • రాకెట్ ప్రయోగానికి సన్నద్ధమవుతున్న శ్రీహరికోట
  • చంద్రయాన్-3 ప్రయోగాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఇస్రో

ఇప్పటికే రెండు దఫాలు చంద్రయాన్ ముశం ను చేపట్టి మిశ్రమ ఫలితాలు అందుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మూడోసారి చంద్రయాన్ చేపడుతోంది. చంద్రయాన్-3 ప్రయోగానికి మూహూర్తం ఖరారు చేసింది. జులై 14న మధ్యాహ్నం 2.35 గంటలకు చంద్రయాన్-3లో భాగంగా జీఎస్ఎల్వీ-ఎంకే3 లేక ఎల్వీమ్3 నింగిలోకి దూసుకెళ్లనుంది. 

ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగం కోసం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ రాకెట్ ప్రయోగ కేంద్రం సన్నద్ధమవుతోంది. చంద్రయాన్-2లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఉండగా... చంద్రయాన్-3లో ప్రొపల్షన్, ల్యాండర్, రోవర్ ను పొందుపరిచారు. 

చంద్రయాన్-2లోని ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగే క్రమంలో విఫలమైన నేపథ్యంలో, అనేక మార్పులు చేర్పులతో చంద్రయాన్-3 ల్యాండర్ ను అభివృద్ధి చేశారు. విక్రమ్ ల్యాండర్ కు బలమైన కాళ్లు అమర్చారు. అత్యధిక వేగంగా దిగినప్పటికీ దెబ్బతినని రీతిలో ల్యాండర్ కు రూపకల్పన చేశారు. 

ఇంజిన్, సెన్సర్, థ్రస్ట్ వైఫల్యాలను గుర్తించి చక్కదిద్దేందుకు అధునాతన సాఫ్ట్ వేర్ ఉపయోగించనున్నారు. చంద్రయాన్-2 నుంచి నేర్చుకున్న గుణపాఠాల నేపథ్యంలో, చంద్రయాన్-3లో సెంటర్ ఇంజిన్ లేదా ఐదో ఇంజిన్ ను తొలగించనున్నారు. 

ఇక, విక్రమ్ లాండర్ చంద్రుడిపై సూర్యరశ్మి సోకని ప్రాంతంలో ల్యాండైనప్పటికీ ఇంధన శక్తిని పొందేందుకు వీలుగా మరిన్ని సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తున్నామని ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ తెలిపారు.

  • Loading...

More Telugu News