Mahesh Babu: ఇప్పుడు విశాఖలో కూడా ఆంధ్రా హాస్పిటల్స్ సేవలు: మహేశ్ బాబు

Mahesh Babu wishes Andhra Hospitals for opening doors in Vizag
  • విజయవాడ కేంద్రంగా ఆంధ్రా హాస్పిటల్స్ సేవలు
  • ఇతర ప్రాంతాలకు కూడా విస్తరణ
  • ఆంధ్రా హాస్పిటల్స్ విశాఖలోనూ విజయవంతం కావాలన్న మహేశ్ బాబు
  • ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో చిన్నారులకు శస్త్రచికిత్సలు చేయిస్తున్న సూపర్ స్టార్
విజయవాడ కేంద్రంగా సేవలు అందిస్తున్న ఆంధ్రా హాస్పిటల్స్ గ్రూప్ ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించింది. తాజాగా విశాఖలోనూ ఆంధ్రా హాస్పిటల్స్ ఏర్పాటైనట్టు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వెల్లడించారు. ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో మహేశ్ బాబు హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు శస్త్రచికిత్సలు చేయిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, ఆంధ్రా హాస్పిటల్స్ విశాఖలోనూ ఏర్పాటవడం పట్ల స్పందించారు. ఆంధ్రా హాస్పిటల్స్ ఇప్పుడు విశాఖపట్నంలోనూ ద్వారాలు తెరిచిందని వెల్లడించారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందించాలన్న ఆంధ్రా హాస్పిటల్స్ ఇకముందు కూడా మరింత విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు మహేశ్ బాబు తెలిపారు. ఆ మేరకు ఆసుపత్రి వర్గాలకు శుభాకాంక్షలు తెలిపారు.
Mahesh Babu
Andhra Hospitals
Visakhapatnam
Andhra Pradesh

More Telugu News