Nara Lokesh: ​దున్నపోతు ప్రభుత్వాన్ని సాగనంపే సమయం వచ్చింది​: నారా లోకేశ్​

Nara Lokesh fires on YCP Govt

  • నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ముగిసిన యువగళం
  • కావలి నియోజవకర్గంలోకి ప్రవేశించిన లోకేశ్ పాదయాత్ర
  • కోవూరు నియోజకవర్గం రాజుపాలెంలో యానాదులతో లోకేశ్ భేటీ
  • యానాదులకు న్యాయం జరగాలంటే సైకో పోవాలన్న టీడీపీ యువనేత

నెల్లూరు జిల్లాలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. కోవూరు నియోజకవర్గం నుంచి పాదయాత్ర ఈ సాయంత్రం కావలి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. కావలి ఇన్చార్జి మాలేపాటి సుబ్బానాయుడు, బీద రవిచంద్ర సతీమణి బీద జ్యోతి, నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలు యువనేతకు అపూర్వ స్వాగతం పలికారు. భారీ గజమాలలు, విచిత్రవేషధారణలు, బాణాసంచా మోతలతో హోరెత్తించారు.
అంతకుముందు, కోవూరు నియోజకవర్గం రాజుపాలెం పీఎస్సార్ కళ్యాణమండపం క్యాంప్ సైట్ వద్ద యానాది సామాజికవర్గ ప్రతినిధులతో లోకేశ్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... దున్నపోతు ప్రభుత్వానికి బైబై చెప్పాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని విమర్శించారు. సంక్షేమ కార్యక్రమాలకు పెట్టే ఖర్చుని ఎస్టీ సబ్ ప్లాన్ లెక్కల్లో రాస్తున్నారని ఆరోపించారు. 

యానాదులకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను జగన్ ప్రభుత్వం వెనక్కి లాక్కుందని,. యానాదులకు న్యాయం జరగాలి అంటే సైకో పోవాలి... సైకిల్ రావాలి అని స్పష్టం చేశారు.

యానాది సామాజికవర్గీయులు మాట్లాడుతూ...

జగన్ పాలనలో ఐటీడీఏని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. రుణాలు ఇవ్వడం లేదని, గిరిజన గురుకుల పాఠశాలలో దుర్భర పరిస్థితులు ఉన్నాయని వాపోయారు. కనీస మౌలిక సదుపాయాలు లేవని, యానాదులకు సబ్సిడీ రుణాలు ఇవ్వడం లేదని వివరించారు. జగన్ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారని మండిపడ్డారు. జగన్ ఎస్టీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని మోసం చేశారని వెల్లడించారు. 

యానాదులను ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ గా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వం పెళ్లి కానుక ఇవ్వడం లేదని, పెళ్లికానుకకు అనేక కండిషన్స్ పెట్టారని ఆరోపించారు. యానాదుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ పెట్టాలని కోరారు. యానాదులకి జగన్ పాలనలో ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదని విచారం వ్యక్తం చేశారు.
నారా లోకేశ్ స్పందన....

సబ్ ప్లాన్ నిధులను ఎస్టీలకే ఖర్చుచేస్తాం!

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేవలం ఎస్టీల సంక్షేమం కోసమే వినియోగిస్తాం. గిరిజన గురుకుల పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తాం. అవసరమైన టీచర్లను నియమిస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఐటీడీఏలను బలోపేతం చేస్తాం. యానాదుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. దామాషా ప్రకారం యానాదులకు నిధులు కేటాయిస్తాం. 

మేం వచ్చిన వెంటనే మహాశక్తి అమలు చేస్తాం!

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాశక్తి పథకాన్ని అమలు చేస్తాం. ఆడ బిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకి రూ.1500 అందిస్తాం. 5 ఏళ్లలో రూ.90 వేల లబ్ది చేకూరుస్తాం. తల్లికి వందనం ద్వారా చదువుకునే ప్రతి బిడ్డకి రూ.15 వేలు అందిస్తాం. ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు ఇస్తాం. 

దీపం పథకం ద్వారా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తాం. ఆర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.

అధికారంలోకి వచ్చాక పెళ్లికానుక ఇస్తాం!

జగన్ కట్టింగ్ మాస్టర్ అందులో భాగంగా పెళ్లి కానుక కూడా కట్ చేశాడు. అనేక కండిషన్స్ పెట్టాడు. 6 లక్షల మందికి పెన్షన్లు కట్ చేసాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ తెచ్చిన చెత్త నిబంధనలు అన్ని ఎత్తేసి పెళ్లి కానుక అందజేస్తాం. ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ లో యానాదులను చేర్చే విధంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కృషి చేస్తాం. 

యానాదుల చేతిలో ఉన్న చెరువులు అన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేశాడు జగన్. జగన్ యానాదుల పొట్ట కొడుతూ తెచ్చిన జీఓ నెం. 217ని టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వంద రోజుల్లోనే రద్దు చేస్తాం. యానాదులకు ఇళ్లు కట్టించి ఇస్తాం. పిల్లలకు ఒక ఆస్తిలా మిగిలిపోయేలా నాణ్యమైన ఇళ్లు కట్టించి ఇస్తాం.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం – 1950.3 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం – 17.1 కి.మీ.*

*150వ రోజు పాదయాత్ర వివరాలు (8-7-2023):*

*కావలి అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్ పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా)*

ఉదయం

8.00 – అల్లూరు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

8.30 – అల్లూరు పాతబస్టాండు వద్ద స్థానికులతో సమావేశం.

8.35 – అల్లూరు వాటర్ ట్యాంకు సెంటర్ లో స్థానికులతో సమావేశం.

8.40 – అల్లూరు ఆర్ కె స్కూలు వద్ద స్థానికులతో సమావేశం.

8.55 – ఇస్కపల్లి తూము వద్ద స్థానికులతో సమావేశం.

9.25 – ఉడిపిగుంట వద్ద ఎస్టీ సామాజికవర్గీయులతో భేటీ.

9.40 – సింగారెడ్డి దిన్నె వద్ద స్థానికులతో సమావేశం.

9.55 – ఊడూరుగుంట వద్ద స్థానికులతో సమావేశం.

10.10 – ఎర్రప్పగుంట వద్ద స్థానికులతో సమావేశం.

11.40 – ఇస్కపల్లిలో భోజన విరామం.

మధ్యాహ్నం

1.00 – ఇస్కపల్లిలో ఉప్పురైతులతో ముఖాముఖి సమావేశం.

సాయంత్రం

4.00 – ఇస్కపల్లి నుంచి పాదయాత్ర కొనసాగింపు.

4.30 – ఇస్కపల్లిలో స్థానికులతో సమావేశం.

6.00 – పాతపాలెంలో స్థానికులతో సమావేశం.

6.30 – తాటిచెట్లపాలెం వద్ద స్థానికులతో సమావేశం.

8.00 – బంగారుపాలెంలో స్థానికులతో సమావేశం.

8.15 – బంగారుపాలెం శివారు విడిది కేంద్రంలో బస.

******

  • Loading...

More Telugu News