Adipurush: చేతులు జోడించి క్షమాపణ చెప్పిన ఆదిపురుష్ రైటర్

On Adipurush dialogues writer Manoj Muntashirs unconditional apology
  • బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైన ఆదిపురుష్
  • చిత్రంలోని డైలాగ్స్‌ పై తీవ్ర విమర్శలు 
  • బేషరతు క్షమాపణ కోరిన మాటల రచయిత మనోజ్ 
రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా నటించిన 'ఆదిపురుష్' చిత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన రోజు నుంచి సినిమా మాటల రచయిత మనోజ్ ముంతాషీర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. పేలవమైన గ్రాఫిక్స్ కంటే మెజారిటీ ప్రేక్షకులు ఆయన రాసిన డైలాగ్స్‌ పై పెదవి విరిచారు. ఒక వర్గం ప్రేక్షకులు సినిమాలోని డైలాగ్స్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. 

దీనిపై సోషల్ మీడియాలోను, ఇంటర్వ్యూలలోను అనేక వివరణలు ఇచ్చిన మనోజ్ తాజాగా బేషరతుగా క్షమాపణ చెప్పారు. ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీసినందుకు హృదయపూర్వక క్షమాపణలు కోరారు.

 ‘ఆదిపురుష్ వల్ల ప్రజల భావోద్వేగాలు దెబ్బతిన్నాయని నేను అంగీకరిస్తున్నాను. చేతులు జోడించి నేను బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను. ప్రభు బజరంగ్ బలి, మమ్మల్ని ఐక్యంగా ఉంచి, మన పవిత్రమైన సనాతన, మన గొప్ప దేశానికి సేవ చేయడానికి శక్తిని ప్రసాదించుగాక’ అని ట్వీట్ చేశారు.
Adipurush
Prabhas
Manoj Muntashir
apology

More Telugu News