Free Cancer Screening: చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రేపు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

Free cancer screening tests for cine labour and cine journalists will be held tomorrow
  • చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తో చేయి కలిపిన స్టార్ హాస్పిటల్స్
  • చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ వద్ద హెల్త్ క్యాంపు
  • సినీ కార్మికులు, సినీ జర్నలిస్టులకు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు
  • ఆదివారం ఉదయం 9.30 గంటలకు క్యాంపు ప్రారంభం 
సినీ కార్మికుల కోసం ఇటీవల చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, స్టార్ క్యాన్సర్ సెంటర్ సంయుక్త కార్యాచరణ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సినీ కార్మికులు, సినీ పాత్రికేయులకు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి చొరవతో ఈ కార్యక్రమం రూపుదాల్చింది. 

ఈ క్రమంలో, రేపు (జులై 9) హైదరాబాద్ లో తొలి క్యాంపును నిర్వహించనున్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, స్టార్ హాస్పిటల్స్ సౌజన్యంతో హైదరాబాదులోని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ వద్ద ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఈ హెల్త్ క్యాంపు ప్రారంభం కానుంది. సినీ కార్మికులు, సినీ జర్నలిస్టులు ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

వేదిక: చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్, రోడ్ నెం.1, జవహర్ కాలనీ, జూబ్లీహిల్స్, హైదరాబాద్.

ఇతర వివరాలకు 91 92465 20296 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.
Free Cancer Screening
Chiranjeevi Charitable Trust
Star Hospitals
Chiranjeevi Eye And Blood Bank
Hyderabad
Tollywood

More Telugu News