Asaduddin Owaisi: ఉమ్మడి పౌర స్మృతిని వ్యతిరేకించాలంటూ కేసీఆర్‌ను కలిసిన అసద్
- ముస్లీం పర్సనల్ లా బోర్డుతో కలిసి కేసీఆర్ ను కలిసిన ఎంపీ
- గిరిజనులకు సంబంధించి లా కమిషన్ కు వనవాసీ కల్యాణ్ సూచన
- త్వరపడి నివేదిక ఇవ్వవద్దని విజ్ఞప్తి
మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సీఎం కేసీఆర్ ను కలిశారు. ముస్లీం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులతో కలిసి ఆయన సోమవారం ప్రగతి భవన్ కు వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఉమ్మడి పౌర స్మృతిని వ్యతిరేకించాలని వారు కేసీఆర్ ను కోరారు.
గిరిజనుల ఆచారాలు, సంప్రదాయాలు అర్థం చేసుకున్నాకే..
ఉమ్మడి పౌర స్మృతి పరిధి నుండి గిరిజనులను మినహాయించాలని న్యాయ శాఖ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ సుశీల్ మోదీ చేసిన సూచనను ఆరెస్సెస్ అనుబంధ సంస్థ అఖిల భారతీయ వనవాసీ కల్యాణ్ ఆశ్రమ్ స్వాగతించింది. గిరిజన ప్రాంతాలను సందర్శించి, గిరిజనుల ఆచారాలు, సంప్రదాయాల గురించి తొలుత అర్థం చేసుకోవాలని, దీనికి సంబంధించి త్వరపడి నివేదిక ఇవ్వవద్దని లా కమిషన్ కు విజ్ఞప్తి చేసింది.