KCR: వీఆర్ఏలతో చర్చల కోసం కేటీఆర్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం
- వీఆర్ఏల సర్దుబాటుపై సీఎం కేసీఆర్ నిర్ణయం
- వీఆర్ఏల అభిప్రాయాలు సేకరించాలని ఆదేశం
- ఉపసంఘంలో సభ్యులుగా మంత్రులు జగదీశ్, సత్యవతి రాథోడ్
- మొత్తం ప్రక్రియ వారం లోపు పూర్తి కావాలన్న సీఎం కేసీఆర్
రాష్ట్రంలో వీఆర్ఏల సర్దుబాటుపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వీఆర్ఏల విద్యార్హతలు, సామర్థ్యాల మేరకు సర్దుబాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నీటి పారుదల, ఇతర శాఖల్లో వీఆర్ఏలను సర్దుబాటు చేయాలని తెలిపారు. వీఆర్ఏల సేవలు విస్తృతంగా ఉపయోగించుకోవాలని సూచించారు.
వీఆర్ఏలతో చర్చించి వారి అభిప్రాయాలు సేకరించాలని, వీఆర్ఏల అభిప్రాయం మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు.
వీఆర్ఏల సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని ఈ ఉపసంఘంలో మంత్రులు జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ సభ్యులుగా ఉన్నారు.
వీఆర్ఏలతో ఈ మంత్రివర్గ ఉపసంఘం రేపటి నుంచి చర్చలు జరపనుంది. చర్చల అనంతరం ఉపసంఘం నివేదిక ఇచ్చాక, మరోసారి చర్చించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. మొత్తం ప్రక్రియ వారం లోపు పూర్తి కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.