Sri Vishnu: 40 కోట్లకి పైగా వసూళ్లతో 'సామజవరగమన'

Samajavaragamana Movie Update
  • జూన్ 29న థియేటర్స్ కి వచ్చిన సినిమా
  • కామెడీ ఎంటర్టయినర్ జోనర్ లో సాగిన కథ   
  • 12 రోజులలో 40 కోట్లకి పైగా వసూళ్లు 
  • యూఎస్ లో 1 మిలియన్ డాలర్ క్లబ్ కి చేరువలో ఉన్న సినిమా

చిన్న సినిమా అయినా సరైన కంటెంట్ ఉంటే చాలు .. థియేటర్లో రెండున్నర గంటలు కూర్చున్నామనే విషయం తెలియకుండా చేస్తే చాలు, ప్రేక్షకులు పెద్ద హిట్ ను తీసుకొచ్చి దోసిట్లో పెడుతున్నారు. అలా ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అందుకున్న సినిమాగా 'సామజవరగమన' కనిపిస్తుంది. 

శ్రీవిష్ణు - రెబల్ మోనికా జాన్ జంటగా నటించిన ఈ సినిమా, జూన్ 29వ తేదీన థియేటర్లకు వచ్చింది. నాన్ స్టాప్ ఎంటర్టయినర్ గా ఈ సినిమా మంచి మార్కులను కొట్టేసింది. 12 రోజుల్లో ఈ సినిమా 40 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టడం విశేషం. శ్రీవిష్ణు కెరియర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమా ఇదేనని అంటున్నారు. 

ఇక ఈ సినిమా యూఎస్ లో 9 లక్షల డాలర్స్ ను రాబట్టింది. త్వరలోనే 1 మిలియన్ డాలర్ మార్క్ ను చేరుకోవడం ఖాయమని అంటున్నారు. శ్రీ విష్ణు కెరియర్లో 1 మిలియన్ డాలర్ సినిమా ఇదే అవుతుందని చెబుతున్నారు. ఫస్టాఫ్ లో నరేశ్ కామెడీ .. సెకండాఫ్ లో వెన్నెల కిశోర్ కామెడీ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయనే సంగతి తెలిసిందే. 

Sri Vishnu
Reba Monika John
Naresh
Vennela Kishore

More Telugu News