Sensex: తీవ్ర ఒడిదుడుకుల మధ్య భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు
- ట్రేడింగ్ చివర్లో అమ్మకాల ఒత్తిడికి గురైన మార్కెట్లు
- 223 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 55 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. ద్రవ్యోల్బణం గణాంకాలతో పాటు కంపెనీల త్రైమాసిక ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ క్రమంలో ట్రేడింగ్ చివర్లో సూచీలు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 223 పాయింట్లు కోల్పోయి 65,393కు పడిపోయింది. నిఫ్టీ 55 పాయింట్లు నష్టపోయి 19,384 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కోటక్ బ్యాంక్ (0.62%), ఏసియన్ పెయింట్స్ (0.48%), సన్ ఫార్మా (0.42%), నెస్లే ఇండియా (0.39%), టైటాన్ (0.31%).
టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-1.17%), టాటా మోటార్స్ (-1.15%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.14%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.95%), ఎన్టీసీపీ (-0.95%).