Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు దమ్ము, ధైర్యం ఉంటే సింగిల్‌గా పోటీ చేయాలి: మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సవాల్
- జగన్ గెలుపును ఆపలేరన్న బాలనాగిరెడ్డి
- రూ.300 కోట్ల ప్యాకేజీ ఇస్తే పవన్ 'జై చంద్రబాబు' అంటారని ఎద్దేవా
- కరోనా సమయంలో ఇంట్లో దాక్కున్నారని విమర్శలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు దమ్ము, ధైర్యం ఉంటే సింగిల్‌గా పోటీ చేయాలని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సవాల్ చేశారు. పవన్ తండ్రి వచ్చి పోటీ చేసినా జగన్ గెలుపును ఆపలేరని వ్యాఖ్యానించారు. జనసేనాని జీవితంలో ముఖ్యమంత్రి కాలేరన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కోసమే ఆయన తాపత్రయమని ఆరోపించారు. రూ.300 కోట్ల ప్యాకేజీ ఇస్తే జై చంద్రబాబు అంటాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా సమయంలో పవన్ ఇంట్లో దాక్కున్నాడని ఎద్దేవా చేశారు. కానీ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రాణాలను లెక్కచేయకుండా పని చేశారన్నారు.
వాలంటీర్లు, మహిళలపై పవన్ వ్యాఖ్యలు సరికాదన్నారు. మాట్లాడే పద్ధతిని నేర్చుకోవాలన్నారు. చంద్రబాబు గురించి మాట్లాడితే వర్షాలు కూడా పడవన్నారు. నారా లోకేశ్ తమ జిల్లాలో అడుగు పెట్టినందుకు వర్షాలు వెనక్కి వెళ్లాయన్నారు. చంద్రబాబు కంటే లోకేశ్ పెద్ద ఐరన్ లెగ్ అన్నారు. కాగా, వుమెన్ ట్రాఫికింగ్ అంటూ వాలంటీర్లపై జనసేన అధినేత చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతున్నాయి.