Panchakarla Ramesh Babu: వైసీపీకి గుడ్‌బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే!
- విశాఖ అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన పంచకర్ల రమేశ్ బాబు
- కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నానంటూ ఆవేదన
- 2009లో ప్రజారాజ్యం పార్టీతో రమేశ్ బాబు పొలిటికల్ ఎంట్రీ
- ఆపై కాంగ్రెస్, టీడీపీ, చివరకు వైసీపీ తీర్థం పుచ్చుకున్న వైనం
- పెందుర్తి, ఎలమంచిలి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా గెలిచిన పంచకర్ల
విశాఖలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు పార్టీని వీడారు. కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నానంటూ ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం తనకు వేదన మిగిల్చిందని వ్యాఖ్యానించారు.
2009లో ప్రజారాజ్యం పార్టీతో పంచకర్ల రమేశ్ బాబు రాజకీయ అరంగేట్రం చేశారు. పెందుర్తి నియోజకవర్గం నుంచి పీఆర్పీ టిక్కెట్టుపై పోటీ చేసి గెలుపొందారు. కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనం, ఆ తరువాత రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేశారు. 2014 నాటి ఎన్నికల్లో ఆయన గంటా శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్‌తో కలిసి టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో ఎలమంచిలి నుంచి గెలిచారు. 2020లో వైసీపీ కండువా కప్పుకున్న ఆయన చివరకు ఆ పార్టీనీ వీడారు.