Baby: ఇంతమంది ఎదురుచూస్తుంటే 'బేబీ' చిన్న సినిమా ఎలా అవుతుంది?
- ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ
- జులై 14న రిలీజ్ కు అంతా సిద్ధం
- సాయిరాజేశ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'బేబీ'
- మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించిన ఎస్కేఎన్
- ఇప్పటికీ మ్యూజికల్ హిట్ గా పేరుతెచ్చుకున్న 'బేబీ'
- ప్రమోషన్స్ తో భారీ హైప్ క్రియేట్ చేసిన చిత్రయూనిట్
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ముఖ్య పాత్రల్లో రూపుదిద్దుకున్న చిత్రం 'బేబీ'. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్కేఎన్ నిర్మాణ సారథ్యంలో సాయిరాజేశ్ దర్శకత్వంలో 'బేబీ' తెరకెక్కింది. ఈ చిత్రం రేపు (జులై 14) గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.
ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే, హీరోయిన్ వైష్ణవి చైతన్యతో ఆనంద్ దేవరకొండ కెమిస్ట్రీ ఎంతో హృద్యంగా అనిపిస్తుంది. పైగా ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనే టాక్ వినిపిస్తోంది. దాంతో యవతకు కావాల్సిన ఎమోషన్లకు కొదవ ఉండకపోవచ్చు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్ అశ్విన్ మధ్య ముక్కోణపు ప్రేమ కథే బేబీ ఇతివృత్తం అని తెలుస్తోంది.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏ యూత్ ఫుల్ లవ్ స్టోరీకైనా సంగీతం సగం విజయం అందిస్తుంది. ఆ లెక్కకొస్తే యువ సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ 100 మార్కులు కొట్టేస్తాడు. 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా' అనే సాంగ్ సూపర్ డూపర్ సెన్సేషనల్ హిట్టయింది. ఓ లవ్ యాంథెమ్ లాగా కుర్రకారు మొబైల్ ఫోన్లలో ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. సినిమా థియేటర్లలో ఈ పాటకు ఆడియన్స్ ఉర్రూతలూగిపోవడం ఖాయం.
వాస్తవానికి బడ్జెట్ పరంగా చూస్తే 'బేబీ' చిన్న సినిమానే. కానీ, సినిమాకు లభించిన హైప్ చూస్తే ఏ భారీ బడ్జెట్ సినిమాకు తీసిపోని రీతిలో ఉంది. బిజినెస్ బాగానే జరిగినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.
మెగా కాంపౌండ్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్న ఎస్కేఎన్ నిర్మాత కాబట్టి థియేటర్ల కొరత అనే సమస్యే రాకపోవచ్చు. దాంతో, పెద్ద సంఖ్యలో థియేటర్లలో ప్రేక్షకులను పలకరించేందుకు బేబీ ముస్తాబైంది.
చిత్రబృందం ఇప్పటికే ప్రమోషన్స్ ను పీక్స్ కు తీసుకెళ్లింది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఎదురుచూసేలా ఓ విధమైన ఆసక్తి క్రియేట్ చేయడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయింది. ముఖ్యంగా 'ఓ రెండు మేఘాలిలా' పాటతో యూత్ లో ఎంత క్రేజ్ రగల్చాలో అంతకంటే ఎక్కవ క్రేజే రగిల్చింది. అలాంటప్పుడు 'బేబీ' చిన్న సినిమా ఎలా అవుతుంది?