WHO: మనుషులకూ బర్డ్‌ఫ్లూతో డేంజర్.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

Who warns of bird flu virus evolving to infect humans

  • క్షీరదాల్లో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగు చూడటంపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన
  • వైరస్‌లో మార్పులు జరిగి మానవులకు సోకే అవకాశం ఉందని హెచ్చరిక
  • మనుషులు, జంతువులనూ టార్గెట్ చేసే కొత్త వైరస్ ‌లూ పుట్టుకురావచ్చని వార్నింగ్

క్షీరదాల్లో తరచూ బర్డ్ ఫ్లూ కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఈ వైరస్ మానవులకు సోకేలా పరిణామం చెందే అకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తాజాగా హెచ్చరించింది. ఏవీయిన్ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లు సాధారణంగా పక్షులను టార్గెట్ చేస్తాయి. బర్డ్ ఫ్లూ కూడా ఓ రకమైన ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా వైరస్సే! అయితే, ఇటీవల కాలంలో మామల్స్‌లోనూ (క్షీరదాలు) బర్డ్ ఫ్లూ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఫలితంగా, ఈ వైరస్‌లో మార్పులు జరిగి మనుషుల్లో వ్యాపించే సామర్థ్యం సంతరించుకోవచ్చని ప్రపంచఆరోగ్య సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. మనుషులు, జంతువులకూ హాని కలిగించే కొత్త తరహా వైరస్‌లూ పుట్టుకురావొచ్చని హెచ్చరించింది.

  • Loading...

More Telugu News