Major League Cricket: అమెరికాలో ప్రారంభమైన మేజర్ లీగ్ క్రికెట్... ఇక్కడ కూడా ఐపీఎల్ జట్లే!

MLC starts in US as Satya Nadella got a franchise

  • శుక్రవారం నుంచి మేజర్ లీగ్ క్రికెట్ పోటీలు
  • వివిధ జట్లను సొంతం చేసుకున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు
  • స్టార్ క్రికెటర్లతో కళకళలాడుతున్న ఎంఎల్ సీ

అమెరికాలో క్రికెట్ కు ప్రజాదరణ కల్పించే ఉద్దేశంతో మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్ సీ) టోర్నీ ప్రారంభించారు. ప్రముఖ భారత సంతతి బిజినెస్ మేన్ అనురాగ్ జైన్ ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. 

ఇదేమీ చిన్నాచితకా టోర్నీ కాదు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ కూడా ఈ టోర్నీలో పాలుపంచుకుంటున్నాయి. కాగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా మేజర్ లీగ్ క్రికెట్ లో ఓ జట్టును సొంతం చేసుకోవడం విశేషం. అడోబ్ సీఈవో శంతను నారాయణతో కలిసి సత్య నాదెళ్ల సియాటిల్ ఆర్కాస్ జట్టులో భాగస్వామ్యం పొందారు. 

ఈ టోర్నీలో సియాటిల్ ఆర్కాస్ తో పాటు లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్, టెక్సాస్ సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ న్యూయార్క్, వాషింగ్టన్ ఫ్రీడమ్, శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్ జట్లు కూడా తలపడుతున్నాయి. శుక్రవారం నాడు ఈ టోర్నీ ప్రారంభమైంది. లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ తో జరిగిన ప్రారంభ మ్యాచ్ లో టెక్సాస్ సూపర్ కింగ్స్ నెగ్గింది. 

డెవాన్ కాన్వే, డుప్లెసిస్, డేవిడ్ మిల్లర్, మిచెల్ శాంట్నర్, డీజే బ్రావో, మార్టిన్ గప్టిల్, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, ఆడమ్ జంపా, లాకీ ఫెర్గుసన్, రిలీ రూసో,  మోజెస్ హెన్రిక్స్, గ్లెన్ ఫిలిప్స్, మార్కో జాన్సెన్, ఆన్రిన్ నోర్కియా, క్వింటన్ డికాక్, హెన్రిచ్ క్లాసెన్, ఇమాద్ వాసిం, హెట్మెయర్, వేన్ పార్నెల్, ఆండ్రూ టై, మాథ్యూ వేడ్, మార్కస్ స్టొయినిస్, ఆరోన్ ఫించ్, హరీస్ రవూఫ్, లియామ్ ప్లంకెట్, ట్రెంట్ బౌల్ట్, టిమ్ డేవిడ్, కీరన్ పొలార్డ్, డివాల్డ్ బ్రెవిస్, నికోలాస్ పూరన్, కగిసో రబాడా వంటి స్టార్ క్రికెటర్లు ఈ టోర్నీలో ఆడుతుండడం విశేషం.

  • Loading...

More Telugu News