ISRO: చంద్రయాన్-3పై ఇస్రో తొలి అప్‌డేట్

ISRO successfully raises chandrayaan 3 orbit

  • మిషన్ సజావుగా సాగుతోందని ఇస్రో ప్రకటన
  • చంద్రయాన్-3 కక్ష్యను విజయవంతంగా మార్చినట్టు శనివారం ప్రకటన
  • ప్రస్తుతం చంద్రయాన్-3 41762 కి.మీ*173 కి.మీల కక్ష్యలో ఉన్నట్టు వెల్లడి

చంద్రయాన్-3కు సంబంధించి ఇస్రో తాజాగా ఓ అప్‌డేట్ విడుదల చేసింది. శనివారం చంద్రయాన్-3 కక్ష్యను మార్చామని వెల్లడించింది. ప్రస్తుతం ఈ మిషన్ సజావుగా తనకు నిర్దేశించిన మార్గంలో పయనిస్తోందని వెల్లడించింది. ఇస్రో అప్‌డేట్ ప్రకారం, చంద్రయాన్-3 ప్రస్తుతం 41762 కి.మీ*173 కి.మీల కక్ష్యలో పరిభ్రమిస్తోంది. క్రమక్రమంగా కక్ష్యను పెంచి అంతిమంగా చంద్రుడివైపునకు దీన్ని మళ్లించాలనేది ఇస్రో ప్లాన్. 

చంద్రుడి రహస్యాలు బయటపెట్టేందుకు ఇస్రో చేపట్టిన మూడో మిషన్ చంద్రయాన్-3. జూలై 14న శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి దీన్ని దిగ్విజయంగా ప్రయోగించారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధన చేపట్టడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం. ఈ క్రమంలో చంద్రయాన్-3లోని లాండర్ విజయవంతంగా చంద్రుడిపై దింపాలని శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ల్యాండర్ సాయంతో చంద్రుడి దక్షిణ ధ్రువపు రహస్యాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News