IMD: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన
- ఈ నెల 16 నుంచి 20 వరకు వర్షాలు
- ఏపీ, తెలంగాణల్లో అక్కక్కడ భారీ వర్షాలు
- పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు
వాయవ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ లపై అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. అదే సమయంలో నైరుతి రుతుపవన ద్రోణి సాధారణ స్థితిలో కొనసాగుతోందని తెలిపింది. ఈ నెల 18 నాటికి వాయవ్య బంగాళాఖాతంపై మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వివరించింది. ఈ నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన చేసింది.
జులై 18 నుంచి 20 వరకు- కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు
జులై 16 నుంచి 20 వరకు- కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
జులై 16 నుంచి 17 వరకు- తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు