USA: పైలట్‌కు తీవ్ర అనారోగ్యం.. విమానం క్రాష్ ల్యాండింగ్
- అమెరికాలోని మసాచుసెట్స్లోగల విన్యార్డ్ ఎయిర్‌పోర్టులో ఘటన
- న్యూయార్క్ నుంచి బయలుదేరిన విమానం
- విన్యార్డ్ ఎయిర్‌పోర్టులో లాండయ్యే క్రమంలో పైలట్‌కు తీవ్ర అస్వస్థత
- రన్‌వేకు సమీపంలోనే విమానం క్రాష్ ల్యాండింగ్
- మహిళకు స్వల్ప గాయాలు, పైలట్ పరిస్థితి విషమం
విమానం మార్గమధ్యంలో ఉండగానే పైలట్ తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో ప్రయాణికురాలు స్వయంగా విమానాన్ని ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో విమానం రన్‌వేకు సమీపంలో క్రాష్ లాండ్ అయ్యింది. అమెరికాలోని మసాచుసెట్స్‌లో గల విన్యార్డ్ ఎయిర్‌పోర్టులో శనివారం ఈ ఘటన వెలుగు చూసింది. ఈ ప్రమాదం నుంచి మహిళ స్వల్పగాయాలతో బయటపడింది. అయితే, పైలట్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
న్యూయార్క్‌లోని వెస్ట్చెస్టర్ నుంచి బయలుదేరిన ఓ తేలికపాటి విమానం విన్యార్డ్ ఎయిర్‌పోర్టులో లాండయ్యే క్రమంలో పైలట్ అస్వస్థతకు గురయినట్టు అక్కడి అధికారులు తెలిపారు. దీంతో, మహిళా ప్యాసెంజర్ విమానాన్ని కిందకు దింపే ప్రయత్నం చేశారని అన్నారు. ఫలితంగా, అది రన్ వేకు సమీపంలో క్రాష్ లాండ్ అవ్వడంతో స్వల్పంగా దెబ్బతింది. మహిళకు స్వల్ప గాయాలే కావడంతో ఆమె చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయినట్టు మసాచుసెట్స్ పోలీసులు తెలిపారు.