Amanchi Krishna Mohan: ఆమంచి కృష్ణమోహన్ కు పాముకాటు.... హుటాహుటీన ఆసుపత్రికి తరలింపు

Amanchi Krishna Mohan has been bitten by a snake while walking
  • వేటపాలెంలో రొయ్యల ఫ్యాక్టరీ వద్ద ఆమంచి వాకింగ్
  • కాటు వేసిన పాము
  • చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
  • నిలకడగా ఆమంచి ఆరోగ్యం!
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పాముకాటుకు గురయ్యారు. వేటపాలెం వద్ద రొయ్యల ఫ్యాక్టరీలో వాకింగ్ చేస్తుండగా ఆయనను పాము కాటు వేసింది. ఆమంచి కృష్ణమోహన్ ను హుటాహుటీన చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమంచి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆమంచి పాముకాటుకు గురయ్యారన్న సమాచారంతో వైసీపీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. అయితే, మరింత మెరుగైన వైద్యం కోసం ఆమంచిని కుటుంబ సభ్యులు తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి తరలించారు.
Amanchi Krishna Mohan
Snake Bite
Vetapalem
Chirala
YSRCP

More Telugu News