Raghu Rama Krishna Raju: జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పెట్టింది వైసీపీ వాళ్లే: రఘురామకృష్ణరాజు

YSRCP leader has put Junior NTR flex says Raghu Rama Krishna Raju
  • కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఫ్లెక్సీలు
  • లోకేశ్ పాదయాత్ర విజయవంతంగా సాగుతోందని కితాబు
  • అమ్మఒడి ఇంకా సగం మంది పిల్లలకు రాలేదని విమర్శ
కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ నెల్లూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. దీనిపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందిస్తూ... తమ వైసీపీ పార్టీ నేతలే ఈ ఫ్లెక్సీలు వేశారని అన్నారు. అయితే తమ పార్టీ వారికి ఏ పని కూడా సరిగా చేయడం రాదని... వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు వేస్తే వాటిపై హరికృష్ణ ఫొటో కూడా ఉంటుందని చెప్పారు. మా వాళ్లు వేసిన ఫ్లెక్సీల్లో హరికృష్ణ ఫొటో లేదని ఎద్దేవా చేశారు. టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోందని... దీన్ని ఓర్చుకోలేకే తమ పార్టీ వాళ్లు ఇలాంటి ఫ్లెక్సీలు పెడుతున్నారని తెలిపారు.

అమ్మఒడి సగం మంది పిల్లలకు ఇప్పటికీ రాలేదని రఘురాజు అన్నారు. మామయ్య నొక్కేసిన డబ్బులు పిల్లలకు ఇంకా రాలేదని చెప్పారు. మద్యం అమ్మకాలు తగ్గినప్పటికీ ఆదాయం పెరిగిందని... వాస్తవానికి అమ్మకాలు తగ్గలేదని, దొంగ సరఫరా చేస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వం పోవడం ఖాయమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఫొటోలు వేసుకుంటున్నారని విమర్శించారు. 

Raghu Rama Krishna Raju
YSRCP
Nara Lokesh
Telugudesam
Junior NTR
Tollywood

More Telugu News