Rain: హైదరాబాదులో వర్షం... లోతట్టు ప్రాంతాల జలమయం
- ఉపరితల ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు
- నిన్నటి నుంచి హైదరాబాదులో ముసురు
- రోడ్లపై నిలిచిన నీరు... ట్రాఫిక్ జామ్
- ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు
- మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ
- పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్... 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్
హైదరాబాద్ నగరాన్ని నిన్నటి నుంచి ముసురు కమ్మేసింది. రుతుపవనాలకు తోడు ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇవాళ కూడా జోరుగా వాన పడుతుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోగా, ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. పలు జిల్లా ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.