Errabelli: మూడు పంటలు కావాలా? రేవంత్ చెప్పిన 3 గంటలు కావాలా?: ఎర్రబెల్లి

Errabelli says Congress destroyed telangana and India

  • 60 ఏళ్లలో కాంగ్రెస్ రైతులను పట్టించుకున్న పాపాన పోలేదన్న ఎర్రబెల్లి 
  • కాంగ్రెస్ దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని ఆరోపణ
  • రేవంత్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించలేదని విమర్శ

బీఆర్ఎస్ ఇచ్చే మూడు పంటలు కావాలా? లేక కాంగ్రెస్ ఇచ్చే మూడు గంటల విద్యుత్ కావాలా? అని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ప్రశ్నించారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు. రైతులపై కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం కనికరం లేదన్నారు. రైతులకు ఉచిత కరెంట్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పాలకుర్తిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ... కాంగ్రెస్ దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందన్నారు. వారి పాలనలో సాగునీరు కాదు కదా... కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదన్నారు.

రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండించ‌క‌పోవ‌డం కాంగ్రెస్ వైఖ‌రికి నిద‌ర్శన‌మ‌న్నారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్‌ను న‌మ్ముకుంటే న‌ట్టేట మునిగిన‌ట్లే అన్నారు. ఆ పార్టీకి త‌గిన బుద్ధి చెప్పాల‌న్నారు. కేసీఆర్ సీఎం అయ్యాకే రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల సంక్షేమం కోసం ఎన్నో ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నట్లు చెప్పారు. రైతుల కోసం ఇంతలా చేసిన ప్రభుత్వం గతంలో లేదని, ఇక ముందు రాదన్నారు. కేసీఆర్ నిర్ణయాల కారణంగా తెలంగాణలో భూముల రేట్లు భారీగా పెరిగాయన్నారు.

  • Loading...

More Telugu News