Ambati Rambabu: పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి అంబటి.. టీడీపీపై విమర్శలు

Ambati Rambabu inspects Polavaram project

  • టీడీపీ ప్రభుత్వ తప్పిదాల వల్లే ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతోందన్న అంబటి
  • గత ప్రభుత్వం పనులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్న
  • తమ ప్రభుత్వంపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని మండిపాటు

భారీ వర్షాల కారణంగా పోలవరం ప్రాజెక్టు వద్ద నీటి మట్టం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టును ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్, డ్యామ్ దగ్గర వరదపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 

ప్రొటోకాల్ కు విరుద్ధంగా టీడీపీ ప్రభుత్వం పనులను చేపట్టిందని అంబటి విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ తప్పిదాల వల్లే ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతోందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం పోలవరం పనులను ఎందుకు పూర్తి చేయలేకపోయిందని ప్రశ్నించారు. కాఫర్ డ్యామ్ కు మూడేళ్లు మాత్రమే కాలపరిమితి ఉంటుందని.. ఆలోగానే డ్యామ్ ను నిర్మించాలని చెప్పారు. తమ ప్రభుత్వంపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.  

  • Loading...

More Telugu News