Low Pressure: బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి భారీ వర్ష సూచన

Low pressure in Northwest Bay Of Bengal

  • వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరాన్ని ఆనుకుని అల్పపీడనం
  • పశ్చిమ వాయవ్య దిశగా పయనం
  • స్థిరంగా కొనసాగుతున్న రుతుపవన ద్రోణి
  • ఏపీలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు
  • తెలంగాణలో నేడు అత్యంత భారీ వర్షం
  • తెలంగాణలో ఈ నెల 21 నుంచి 24 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఒడిశా తీర ప్రాంతాన్ని ఆనుకుని వాయవ్య బంగళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. రాగల రెండు మూడు రోజుల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా ఒడిశా తీరం వెంబడి నిదానంగా పయనించనుంది. అదే సమయంలో నైరుతి రుతుపవన ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని ఐఎండీ వివరించింది. 

ఈ క్రమంలో, ఏపీకి భారీ వర్ష సూచన చేసింది. రాగల 5 రోజుల్లో కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగతా చోట్ల విస్తారంగా వర్షాలు పడతాయని వెల్లడించింది. 

ఇక, తెలంగాణలో నేడు అత్యంత భారీ వర్షం కురుస్తుందని, ఈ నెల 21 నుంచి 24 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ పేర్కొంది.

  • Loading...

More Telugu News