Telangana: జీహెచ్ఎంసీ పరిధిలో రేపు, ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవు

TS declares two days holidays for schools and government offices due to heavy rains

  • భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు
  • ఈ రెండ్రోజులు ప్రభుత్వ కార్యాలయాలకూ సెలవు
  • ప్రయివేటు సంస్థలకు సెలవు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖకు ఆదేశాలు

హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో రేపు, ఎల్లుండి... రెండ్రోజుల పాటు అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా రెండ్రోజులు సెలవు ఇచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రయివేటు సంస్థలకు కూడా రేపు, ఎల్లుండి సెలవులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. 

హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురుస్తుండడంతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. లోతట్టు ప్రాంతాల్లో డీఆర్ఎఫ్ టీంలను సిద్ధం చేశారు. శిథిలావస్థ భవనాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించారు. నాలా పనులు పూర్తి కాని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో 24 గంటల పాటు సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. సహాయ కేంద్రాల కోసం కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నారు. హెలికాప్టర్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పని చేయాలని విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News