Kerala: మద్యం మత్తులో అడ్డరోడ్డు అనుకున్నాడు.. రైల్వేట్రాక్‌పై కారు నడిపి ఇరుక్కుపోయాడు!
- కేరళలోని కన్నూరులో ఘటన
- ట్రాక్‌పై ఇరుక్కుపోయిన కారు
- గేట్‌కీపర్, స్థానికులు సకాలంలో అప్రమత్తం కావడంతో తప్పిన పెను ప్రమాదం
- నిందితుడిని అరెస్ట్ చేసి, కారును సీజ్ చేసిన పోలీసులు
సీసాలో ఉన్నంత వరకే మద్యం కదలకుండా ఉంటుంది. ఒకసారి కడుపులోకి వెళ్తే ప్రతాపం చూపిస్తుంది. మనిషిలోని విచక్షణ జ్ఞానాన్ని చంపేస్తుంది. ఏం చేస్తున్నామో కూడా తెలియనంత మత్తులో ముంచేస్తుంది. ఇందుకు నిదర్శనమే ఇది. ఓ వ్యక్తి ఫుల్లుగా మందుకొట్టి కారెక్కాడు. ఆపై ఇంటికి వెళ్తూ రోడ్డనుకుని రైల్వే ట్రాక్ ఎక్కేశాడు. రోడ్డంతా గతుకులుగా ఉంటే అడ్డరోడ్డు అనుకున్నాడు.
అలా కొంతదూరం వెళ్లాక పట్టాలపై కారు ఇరుక్కుపోవడంతో అప్పుడు మనోడికి మత్తు దిగింది. మరోవైపు, ఇరుక్కుపోయిన కారును చూసిన రైల్వే గేట్ కీపర్, స్థానికులు పోలీసులకు, సమీపంలోని రైల్వే స్టేషన్‌కు సమాచారం అందించడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కారును సీజ్ చేశారు. కేరళలోని కన్నూరులో ఈ నెల 18న జరిగిందీ ఘటన. నిందితుడు 48 ఏళ్ల జయప్రకాశ్ ఇప్పుడు తీరిగ్గా కటకటాలు లెక్కపెట్టుకుంటున్నాడు.