TTD: శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల కోటా విడుదల.. ఎప్పుడంటే..!

Tirumal Srivari Special Darshan Tickets will be available from july 24

  • శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు ఈ నెల 24న రిలీజ్
  • ఆగస్టు, సెప్టెంబర్ నెలల టికెట్లు ఈ నెల 25న విడుదల
  • అదనపు కోటా కింద నాలుగు వేల టికెట్లు
  • ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి రూ.300 టికెట్ల కోటాను ఈ నెల 25న రిలీజ్ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల కోటాకు సంబంధించి టికెట్లను టీటీడీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు వివరించింది. అదనపు కోటా కింద నాలుగు వేల టికెట్లతో పాటు అక్టోబర్ నెలకు సంబంధించి రోజుకు 15 వేల టికెట్లను అందుబాటులో ఉంచనుంది. అదేవిధంగా, శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించి అక్టోబర్ నెల కోటా టికెట్లను ఈ నెల 24న ఉదయం 11 గంటలకు, అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించి వృద్ధులు, వికలాంగుల కోటా దర్శన టికెట్లను రిలీజ్ చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

మరోవైపు, శనివారం (22వ తేదీ) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ప్రస్తుతం అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయని, కంపార్ట్మెంట్ల బయట కూడా భక్తులు క్యూ కట్టారని వివరించారు. శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News