Redya Naik: అలాంటి అధికారులను మహిళలతో తన్నిస్తా: బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్
- మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని తనకు ఫిర్యాదులు రాకూడదన్న రెడ్యా నాయక్
- ఫిర్యాదు వస్తే బాధ్యుడైన అధికారిని మహిళలతో తన్నిస్తానని హెచ్చరిక
- పనులు పూర్తి చేయకపోతే ప్రజలు ఓట్లు ఎలా వేస్తారని మండిపాటు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మిషన్ భగీరథ నీళ్లు తమ ఇంటికి రాలేదని ఎవరైనా తనకు ఫిర్యాదు చేస్తే... దానికి బాధ్యులైన అధికారిని మహిళలతో తన్నిస్తానని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఫకీరాతండాలో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ప్రజలు చెపితే 4 నెలల క్రితమే రూ. 5 లక్షలు మంజూరు చేశామని... కానీ ఇప్పటికీ పనులు పూర్తి కాలేదని ఆయన చెప్పారు. ఇలా అయితే తమకు ప్రజలు ఓట్లు ఎలా వేస్తారని అధికారులపై మండిపడ్డారు. ఈ నెల 28 నాటికి లోటుపాట్లను సరిదిద్దుకోవాలని చెప్పారు.
రెడ్యా నాయక్ ఇప్పటి వరకు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వచ్చే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని, ఆ తర్వాత పోటీ చేయబోనని, ఇంకొక్కసారి తనను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గ్రామాల్లో తిరుగుతూ ఆయన అప్పుడే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.