Telangana: తెలంగాణకు రెడ్ అలర్ట్.. 25, 26, 27 తేదీల్లో అతి భారీ వర్షాలు
- వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ
- ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడి
- గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రకటన
తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తెలంగాణలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. తాజాగా రెడ్ అలర్ట్ ప్రకటించింది.
25, 26, 27 తేదీల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.