Andhra Pradesh: జల్ జీవన్ అమలులో పనితీరు సరిగా లేని రాష్ట్రాల్లో ఏపీ ఒకటి: కేంద్రం వెల్లడి
- కొనసాగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
- రాజ్యసభలో ప్రశ్నించిన బీజేపీ సభ్యుడు జీవీఎల్
- బదులిచ్చిన కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్
- ఏపీ జల్ జీవన్ నిధులు సరిగా వినియోగించుకోలేదని వెల్లడి
- జల్ జీవన్ మిషన్ లో ఏపీ పనితీరు తీసికట్టు అని వివరణ
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బదులిచ్చారు. జల్ జీవన్ మిషన్ అమలులో ఏపీ ప్రభుత్వం పనితీరు బాగాలేదని విమర్శనాత్మకంగా వెల్లడించారు.
కేంద్ర నిధులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడంలేదని షెకావత్ రాజ్యసభలో వివరించారు. 2021 నుంచి ఈ పథకం నిధులను ఏపీ వినియోగించుకోలేదని వెల్లడించారు. జల్ జీవన్ అమలులో పనితీరు సరిగా లేని రాష్ట్రాల్లో ఏపీ ఒకటని స్పష్టం చేశారు.
జల్ జీవన్ పథకానికి చెల్లింపుల్లో ఏపీ ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నామని షెకావత్ రాజ్యసభకు తెలియజేశారు.