Sakshi Singh Dhoni: బంధాలు .. బంధుత్వాల గురించి చాటిచెప్పే సినిమా ఇది: ‘ఎల్జీఎం’ నిర్మాత సాక్షి ధోని
- ధోని సొంత బ్యాన్టర్లో నిర్మితమైన 'LGM'
- తమిళ .. తెలుగు భాషల్లో ఆగస్టు 4 న రిలీజ్
- తెలుగులోను ధోనికి అభిమానుల సంఖ్య ఎక్కువన్న సాక్షి
- ఇకపై వరుస సినిమాలు నిర్మిస్తామని వెల్లడి
- తను అల్లు అర్జున్ సినిమాలు ఎక్కువగా చూస్తానని వ్యాఖ్య
ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని అత్తారింటిలోకి అడుగు పెట్టాల్సిన అమ్మాయి అత్తగారితో కలిసి ఉండలేనని, వేరు కాపురం పెడతామని పెళ్లికి ముందే ఆ కాబోయే వరుడితో అంటే.. తనకు కాబోయే అత్త ఎలాంటిదో తెలుసుకోవాలంటే ఆమెతో ఓ వారం ట్రిప్ వెళతానని అమ్మాయి చేసుకోబోయే అబ్బాయితో అంటే.. ఓ వైపు తల్లి.. మరో వైపు కాబోయే భార్య మధ్య ఆ కుర్రాడు ఎలా ఇబ్బంది పడ్డాడనే కథాంశంతో రూపొందిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఎల్జీఎం’
నదియా మాట్లాడుతూ .. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చాను. ధోని ఎంటర్టైన్మెంట్స్లో పార్ట్ కావటం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలను మీరెలా ఎంజాయ్ చేశారో.. అలాగే ఈ సినిమాను కూడా ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను. మంచి టీమ్‌తో కలిసి వర్క్ చేశాను. ధోని, సాక్షిగారికి ధన్యవాదాలు. మీ ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరచిపోలేను`` అన్నారు.
హీరోయిన్ ఇవానా మాట్లాడుతూ .. ‘ఎల్జీఎం’ మాకెంతో స్పెషల్ మూవీ. ధోనిగారి ప్రొడక్షన్లో తొలి సినిమాగా వస్తున్న ఇందులో మేం పార్ట్ కావటం చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలోనే మరచిపోలేని అనుభవం. సినిమా షూటింగ్‌ను చాలా ఎంజాయ్ చేసి చేశాం. ఆగస్ట్ 4న సినిమా రిలీజ్ అవుతుంది. ఫీల్ గుడ్ సినిమాను తప్పకుండా ఎంజాయ్ చేస్తారు" అన్నారు.
హీరో హరీష్ కళ్యాణ్ మాట్లాడుతూ .. తెలుగు సినిమాలకు, తెలుగు ఆడియెన్స్‌కు నేను పెద్ద అభిమానిని. ఎందుకంటే మీరు సినిమాను పండుగలా సెలబ్రేట్ చేస్తారు. తెలుగు స్టార్స్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని. తెలుగు సినిమాను నెక్ట్స్ రేంజ్‌కు చేరుకుంది. కొత్త సినిమాలను పెద్ద పెద్ద స్టార్స్ ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్న తీరు గొప్పగా ఉంది. 'జెర్సీ' సినిమాలో చిన్న రోల్లో మిమ్మల్ని మెప్పించాను. ఇప్పుడు ‘ఎల్జీఎం’ తో మీ ముందుకు రాబోతున్నాను. చాలా ఎంటర్టైనింగ్ మూవీ. ధోనిగారికి, సాక్షిగారికి, ఇవానా, విజయ్ సహా అందరికీ థాంక్స్. ఆగస్ట్ 4న ‘ఎల్జీఎం’ మూవీ థియేటర్స్‌లోకి వస్తుంది`` అన్నారు.
సాక్షి ధోని మాట్లాడుతూ .. సాధారణంగా మావారు ధోని.. ఎప్పుడూ సర్‌ప్రైజ్‌లిస్తుంటారు. ఆయన నుంచి వచ్చిన మరో సర్ప్రైజ్ ఇది. సాధారణంగా క్రికెట్ అంటే ఎంటర్టైన్మెంట్. కానీ, మా వారికి అది ప్రొఫెషన్. క్రికెట్ ఎలాగో సినిమా కూడా ఎంటర్టైన్మెంట్ కాబట్టి సినీ పరిశ్రమలోకి వచ్చాం. ఇద్దరం చాలా సినిమాలు చూస్తాం. అది థియేటర్లో కావచ్చు. ఓటీటీలో కావచ్చు. ఆ ఇష్టంతోనే ఈ రంగంలోకి వచ్చాం. ఇంకా మరెన్నో సినిమాలను చేయటానికి సిద్ధంగా ఉన్నాం. ‘ఎల్జీఎం’ సినిమాను తమిళంలో చేసినా, తెలుగులో ధోనికి భారీ సంఖ్యలో అభిమానులున్నారు. అందువల్ల తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాం.