Etela Rajender: బీజేపీ అధికారంలోకి వస్తే ఇంట్లో ఇద్దరు వృద్ధులకు పెన్షన్: ఈటల రాజేందర్
- కేసీఆర్ ను గద్దె దించే వరకు పోరాటం చేస్తామన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే
- మద్యం ద్వారా వచ్చే ఆదాయం కూడా పేదల కోసం ఖర్చు చేయడం లేదని ఆరోపణ
- బీజేపీ గెలిచాక సంపన్నులకు రైతు బంధు తీసేస్తామని వెల్లడి
- పేదల పైసలకు బీజేపీ ప్రభుత్వం కాపలాగా ఉంటుందని వ్యాఖ్య
కేసీఆర్ ను గద్దె దించే వరకు తాము పోరాటం చేస్తామని హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ సోమవారం అన్నారు. పథకాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం చేసే ఖర్చు కాసింత మాత్రమే అన్నారు. మద్యం ద్వారానే తెలంగాణకు ఏడాదికి రూ.45 వేల కోట్లు వస్తోందని చెప్పారు. కనీసం మద్యంపై వచ్చే డబ్బులు కూడా పేదల కోసం ఈ ప్రభుత్వం ఖర్చు చేయడం లేదని మండిపడ్డారు. యువతను నిర్వీర్యం చేస్తోన్న చరిత్ర కేసీఆర్ ది అని దుయ్యబట్టారు.
బీజేపీ అధికారంలోకి వస్తే ఇంట్లో ఇద్దరు వృద్ధులకు పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. సంపన్నులకు రైతు బంధు, రైతు బీమాను తీసేస్తామని, కేవలం పేదలకు, మధ్యతరగతికి ప్రజలకు మాత్రమే అందిస్తామన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే పేదల పైసలకు కాపాలదారుగా ఉంటామన్నారు. తెలంగాణలో వాడవాడలా బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయన్నారు.