Vishnu Vardhan Reddy: అమరావతి రైతులకు ప్లాట్లు ఇవ్వనప్పుడు.. వారి భూములను ఎలా ఉపయోగించుకుంటారు?: విష్ణువర్ధన్ రెడ్డి

How can Jagan govt uses Amaravati farmers lands asks BJP Vishnu Vardhan Reddy

  • పులివెందులలోనే జగన్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయలేదన్న విష్ణువర్ధన్ రెడ్డి
  • అమరావతిలో 50 వేల ఇళ్లను నిర్మిస్తానని చెపితే  ఎవరైనా నమ్ముతారా? అని ప్రశ్న
  • రాజధాని రైతుల హక్కులను ప్రభుత్వం గుర్తించకపోవడం దారుణమని వ్యాఖ్య

అమరావతిలోని ఆర్ 5 జోన్ లో పేదల ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ నిన్న శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సీఎంపై విమర్శలు గుప్పించారు. సొంత నియోజకవర్గం పులివెందులలోనే జగన్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయలేదని... అలాంటిది అమరావతిలో 50 వేల ఇళ్లను నిర్మిస్తానని చెపితే ఎవరైనా నమ్ముతారా? అని ప్రశ్నించారు. ఓట్ల కోసమే జగన్ కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. 

రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులకే ఇప్పటి వరకు ఫ్లాట్లను ఇవ్వలేదని... అలాంటప్పుడు వారి భూములను ఉపయోగించుకునే హక్కు జగన్ ప్రభుత్వానికి ఎక్కడిదని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. అమరావతి రైతుల హక్కులను ప్రభుత్వం గుర్తించకపోవడం దారుణమని అన్నారు. మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలను స్వీకరించిన పురందేశ్వరి ఈరోజు కోస్తాంధ్ర జోన్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ సుజనా చౌదరి, విష్ణువర్ధన్ రెడ్డి తదితర నేతలు హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News