Ammisetty Vasu: దమ్ముంటే మంత్రి పదవి వదిలేసి రారా.. బట్టలూడదీసి కొడతాం: జోగి రమేశ్ కు అమ్మిశెట్టి వాసు వార్నింగ్
- పవన్ కల్యాణ్ పై జోగి రమేశ్ వ్యాఖ్యల వివాదం
- నువ్వు తార్చితేనే మంత్రి పదవి వచ్చిందంటూ జోగిపై అమ్మిశెట్టి ఫైర్
- మళ్లీ సీటు రాదనే భయంతో కారుకూతలు కూస్తున్నావా? అని ప్రశ్న
జనసేనాని పవన్ కల్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి జోగి రమేశ్ పై జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు విరుచుకుపడ్డారు. విజయవాడ బెంజ్ సర్కిల్ లో వాసు ఆధ్వర్యంలో జనసేన ఆందోళన కార్యక్రమం నిర్వహించింది. ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు జనసైనికులు యత్నించారు. ఈ క్రమంలో అమ్మిశెట్టి వాసును పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి బలవంతంగా తరలించారు.
ఈ సందర్భంగా మీడియాతో అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ... జోగి రమేశ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నువ్వు తార్చితేనే నీకు ఎమ్మెల్యే సీటు, మంత్రి పదవి వచ్చిందని వాసు అన్నారు. బ్రోకర్ పనులు చేసినందుకే మంత్రి పదవి దక్కిందని చెప్పారు. జోగి రమేశ్ ఒక బ్రోకర్, ఒక జోకర్ అని అన్నారు. జోగి రమేశ్ అన్న మాటలు తప్పు అని చెప్పాల్సిన జగన్... వాటిని సమర్థించడం దారుణమని చెప్పారు. మీ నాయకుడు జగన్ మాదిరి బాబాయ్ ని చంపి తాము అధికారంలోకి రాలేదని దుయ్యబట్టారు.
మీ జగన్ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని... మా పవన్ కల్యాణ్ కష్టార్జితాన్ని పేదలకు పంచుతున్నారని వాసు అన్నారు. ప్రభుత్వ సొమ్ములు పంచే సభల్లో బూతులు మాట్లాడటం ఏమిటని మండిపడ్డారు. దమ్ముంటే మంత్రి పదవి వదిలి రారా... విజయవాడ నడి రోడ్లపై బట్టలూడదీసి కొడతామంటూ జోగి రమేశ్ కు వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ సీటు రాదనే భయంతో కారుకూతలు కూస్తున్నావా? అని ఎద్దేవా చేశారు. మరో ఎనిమిది నెలల్లో నీవు ఇంటికి వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు.