DK Shivakumar: మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు సింగపూర్ నుంచి కుట్రలు చేస్తున్నారు: డీకే శివకుమార్

Some are hatching conspiracy to collapse our govt says DK Shivakumar
  • బెంగళూరులో ఏం చేసినా తమకు క్షణాల్లోనే తెలిసిపోతుందన్న డీకే
  • అందుకే విదేశాల్లో కూర్చొని కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్య
  • వైద్య పరీక్షల కోసం సింగపూర్ కు వెళ్లిన కుమారస్వామి
తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సింగపూర్ లో కుట్రలు జరుగుతున్నాయని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. కొంతమంది సింగపూర్ లో ఉన్నారని... వారు అక్కడ ఏం చేస్తున్నారో తనకు తెలుసని చెప్పారు. వారు ఏం చేస్తున్నారనేది సన్నిహితుల ద్వారా తెలిసిందని అన్నారు. బెంగళూరులో ఏం చేసినా తమకు క్షణాల్లోనే తెలిసిపోతుందని... అందుకే విదేశాల్లో కూర్చొని కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. వైద్య పరీక్షల కోసం మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి సింగపూర్ కు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే డీకే ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తాము భయపడమని అన్నారు. 

DK Shivakumar
Congress
Kumaraswamy
JDS
Singapore

More Telugu News