Adimulapu Suresh: మాదిగలంతా జగన్ కు రుణపడి ఉంటారు: ఆదిమూలపు సురేశ్
- మాల, మాదిగల మధ్య చంద్రబాబు విభేదాలు సృష్టిస్తున్నారన్న సురేశ్
- ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడినప్పుడు మాదిగలపై కేసులు పెట్టించారని విమర్శ
- కేసులు ఎత్తేసేందుకు జగన్ అంగీకరించారని వెల్లడి
మాల, మాదిగల మధ్య టీడీపీ అధినేత చంద్రబాబు విభేదాలను సృష్టిస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేశ్ విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు పోరాడినప్పుడు కేసులు పెట్టించారని ఆరోపించారు. ఎస్సీలపై కేసులు పెట్టించిన చంద్రబాబును ఎలా నమ్మాలని ప్రశ్నించారు.
ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసినప్పుడు పెట్టిన కేసులను ఎత్తేయాలని ముఖ్యమంత్రిని కోరామని... మంద కృష్ణ మాదిగతో పాటు మాదిగలందరిపై పెట్టిన కేసులను ఎత్తేయాలని విన్నవించామని చెప్పారు. కేసులను ఎత్తేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని తెలిపారు. మాదిగలంతా జగన్ కు రుణపడి ఉంటారని తెలిపారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను ఈరోజు మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.