CPI Narayana: ఆయన విడాకులు తీసుకుని పెళ్లి చేసుకుంటే మీకు ఏం సమస్య?: జగన్ పై సీపీఐ నారాయణ ఫైర్

What is issue for Jagan on Pawan Kalyan marriages asks CPI Narayana
  • జగన్ ఎప్పుడూ పవన్ పెళ్లిళ్ల గురించే మాట్లాడుతున్నారని నారాయణ విమర్శ
  • మూడు పెళ్లిళ్లు తప్పా? లేక బాబాయ్ ని హత్య చేయడం తప్పా? అని ప్రశ్న
  • సీఎం హోదాను మర్చిపోయి దిగజారి మాట్లాడుతున్నారని మండిపాటు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ విమర్శలు గుప్పించారు. జగన్ ప్రతిసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించే మాట్లాడుతున్నారని... పవన్ విడాకులు తీసుకుని మూడు పెళ్లిళ్లు చేసుకుంటే జగన్ కు ఏం సమస్య? అని ప్రశ్నించారు. మూడు పెళ్లిళ్లు తప్పా? లేక బాబాయ్ ని హత్య చేయడం తప్పా? అని ప్రశ్నించారు. బాబాయ్ ని చంపడం తప్పు కాదని జగన్ చెపుతారా? అని అడిగారు. 

జగన్ తన సీఎం హోదాను మర్చిపోయి దిగజారి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాజకీయ పరంగా ఎవరినైనా విమర్శించవచ్చని... తరచూ వ్యక్తిగత దూషణలు చేయడం, నిందలు వేయడం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయంగా విమర్శించేందుకు ఏమీ లేకపోవడం వల్లే జగన్ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని విమర్శించారు. 

CPI Narayana
Jagan
YSRCP
Pawan Kalyan
Janasena

More Telugu News