PSLV C-56: పీఎస్ఎల్వీ సి-56 రాకెట్ నమూనాతో శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు

ISRO scientists visits Tirumala ahead of PSLV C56 Rocket launch tomorrow

  • మరో రాకెట్ ప్రయోగానికి సన్నద్ధమవుతున్న ఇస్రో
  • రేపు ఉదయం నింగిలోకి పీఎస్ఎల్వీ సి-56
  • నేటి ఉదయం 5.01 గంటలకు ప్రారంభమైన కౌంట్ డౌన్
  • రాకెట్ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచిన ఇస్రో సైంటిస్టులు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రేపు పీఎస్ఎల్వీ సి-56 రాకెట్ ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే కౌంట్ డౌన్ మొదలైంది. ఈ వాణిజ్యపరమైన రాకెట్ ప్రయోగం ద్వారా సింగపూర్ కు చెందిన 7 శాటిలైట్లను నిర్దేశిత కక్ష్యల్లోకి పంపించనున్నారు. 

ఈ నేపథ్యంలో, ఇస్రో శాస్త్రవేత్తలు నేడు తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. పీఎస్ఎల్వీ సి-56 రాకెట్ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. రేపటి రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్థించారు. 

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సి-56 రాకెట్ రేపు (జులై 30) ఉదయం 6.30 గంటలకు రోదసిలోకి దూసుకెళ్లనుంది. నేటి ఉదయం 5.01 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం కాగా, ప్రస్తుతానికి సజావుగా కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News