Twitter: ట్విట్టర్ ద్వారా యూజర్లకు ఆదాయం... విధివిధానాలు ఇవిగో!
- గతంలోనే క్రియేటర్లకు స్వాగతం పలికిన ఎలాన్ మస్క్
- యూట్యూబ్ తరహాలో ట్విట్టర్ లోనూ యాడ్ మోనిటైజేషన్
- రెవెన్యూ షేరింగ్ విధానం తీసుకువచ్చిన ట్విట్టర్
యూట్యూబ్ లో వీడియోలు పోస్టు చేసిన వారు వ్యూస్ ఆధారంగా ఆదాయం పొందుతుండడం తెలిసిందే. ఇప్పుడదే తరహాలో ట్విట్టర్ లోనూ యూజర్లు ఆదాయం అందుకునేలా కొత్త ఫీచర్ తీసుకువచ్చారు.
ఈ యాడ్ రెవెన్యూ విధానం ఎలా ఉంటుందంటే... వెరిఫైడ్ యూజర్లు ట్విట్టర్ లో చేసే పోస్టులకు వచ్చే రిప్లయ్స్ లో కొన్ని వాణిజ్య ప్రకటనలను ప్రదర్శిస్తారు. ఇలాంటి పోస్టులకు వచ్చే ఇంప్రెషన్స్ సంఖ్య ఆధారంగా యూజర్లు ఆదాయం ఆధారపడి ఉంటుంది.
దీనికి సంబంధించిన విధివిధానాలను ట్విట్టర్ నూతన యాజమాన్యం తెరపైకి తెచ్చింది. ట్విట్టర్ ద్వారా నేరుగా ఆదాయం పొందవచ్చంటూ ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ క్రియేటర్లకు ఆహ్వానం పలుకుతున్నారు.