2nd ODI: రెండో వన్డేకు వర్షం అంతరాయం... అప్పటికే 5 వికెట్లు కోల్పోయిన భారత్

Rain halts 2nd ODI between Team India and West Indies

  • బ్రిడ్జ్ టౌన్ లో భారత్ వర్సెస్ వెస్టిండీస్
  • టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ అప్పగించిన ఆతిథ్య జట్టు
  • 113 పరుగులకే 5 వికెట్లు చేజార్చుకున్న భారత్
  • 24.1 ఓవర్ల వద్ద వర్షంతో నిలిచిపోయిన మ్యాచ్

వెస్టిండీస్ తో రెండో వన్డేలో టీమిండియా కష్టాల్లో పడింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ ఓ దశలో వికెట్ నష్టపోకుండా 90 పరుగులతో పటిష్ఠ స్థితిలో నిలిచింది. అయితే అనూహ్య రీతిలో 23 పరుగుల తేడాతో 5 వికెట్లు చేజార్చుకుంది. 

ఓపెనర్లు ఇషాన్ కిషన్ 55, శుభ్ మాన్ గిల్ 34 పరుగులు చేశారు. వీరిద్దరూ 5 పరుగుల తేడాతో అవుట్  కాగా, అక్కడ్నించి భారత టాపార్డర్ పతనం ప్రారంభమైంది. వన్ డౌన్ లో వచ్చిన సంజు శాంసన్ 9 పరుగులకే అవుట్ కాగా, అక్షర్ పటేల్ 1, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 7 పరుగులకే అవుట్ కావడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు సాధించడం కూడా కష్టంగా మారింది. 

ఈ దశలో 24.1 ఓవర్ల వద్ద వరుణుడు ప్రత్యక్షం కావడంతో భారత వికెట్ల పతనానికి అడ్డుకట్టపడింది. అప్పటికి భారత్ స్కోరు 5 వికెట్లకు 113 పరుగులు కాగా, వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ 2, జేడెన్ సీల్స్ 1, గుడాకేశ్ మోతీ 1, యానిక్ కరియా 1 వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News