Professors: ఏపీలో వర్సిటీ అధ్యాపకుల పదవీ విరమణ వయసు పెంపు

Retirement age of professors in AP Universities hiked
  • వర్సిటీ అధ్యాపకుల పదవీ విరమణ వయసుపై కీలక నిర్ణయం
  • 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచిన ఏపీ ప్రభుత్వం
  • వర్సిటీల రిజిస్ట్రార్ లకు ఆదేశాలు
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల అధ్యాపకుల పదవీ విరమణ వయసుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్సిటీ అధ్యాపకుల పదవీ విరమణ వయసును 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచింది. ఉన్నత విద్యాశాఖ పరిధిలోని వర్సిటీల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు ఈ పెంపు నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు వర్సిటీల రిజిస్ట్రార్ లకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వర్సిటీ అధ్యాపకుల పదవీ విరమణ వయసును 60 ఉంచి 62 ఏళ్లకు పెంచగా, ఇప్పుడు దాన్ని 65 ఏళ్లకు పెంచారు.
Professors
Universities
Retirement Age
Andhra Pradesh

More Telugu News