Nara Lokesh: సీఎం జగన్ ది సిగ్గులేని జన్మ: అద్దంకిలో లోకేశ్ వాడీవేడి ప్రసంగం
- బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో యువగళం
- అద్దంకిలో లోకేశ్ బహిరంగ సభ
- అద్దంకి పులి అంటూ గొట్టిపాటి రవికుమార్ పై ప్రశంసల వర్షం
- బీసీల పాలిట జగన్ సైతాన్ లా మారాడని విమర్శలు
- టీడీపీ గెలిచాక అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలుపుతామని వెల్లడి
బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. లోకేశ్ ఇవాళ అద్దంకిలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు విశేష స్పందన లభించింది. లోకేశ్ తన పదునైన ప్రసంగంతో సీఎం జగన్, వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. తీవ్ర పదజాలంతో అధికార పార్టీ నేతలను ఏకిపారేశారు.
అద్దంకి మాస్ జాతర అదిరిపోయింది
జగన్ బీసీల పాలిట సైతాన్ గా మారాడు
15 ఏళ్ల పిల్లాడు అమర్నాథ్ గౌడ్ ని కాళ్లు, చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెడితే వైసీపీ బీసీ నాయకులు ఏం అయ్యారు? 5వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం జరిగితే వైసీపీలో ఉన్న బీసీ నేతలు గొంతు విప్పలేదు.
ఇప్పుడు ఏకంగా బీసీ సమాజాన్నే అవమానించాడు సైకో జగన్. బిడ్డని కోల్పోయిన ఒక తల్లిని, తమ్ముడ్ని కోల్పోయిన ఒక అక్కని, భర్తని కోల్పోయిన భార్యని, తండ్రిని కోల్పోయిన కొడుకుని జగన్ పెయిడ్ ఆర్టిస్టులు అని అవమానించాడు. ఆఖరికి కార్యక్రమం హోస్ట్ చేసిన బీసీ బిడ్డ ఉదయభాను గారిని కూడా ట్రోల్ చేసింది పేటీఎం గ్యాంగ్. ఆవిడ చేసిన తప్పేంటి?... ఒక బీసీ బిడ్డ గొంతు విప్పి మాట్లాడటం కూడా తప్పేనా?
బీసీ వర్గానికి చెందిన బాధితులను పెయిడ్ ఆర్టిస్టులు, డ్రామా ఆర్టిస్టులు అనడానికి మనస్సు ఎలా వచ్చింది సైకో జగన్. జగన్ ది సిగ్గులేని జన్మ. ఒక్క బీసీ కుటుంబాన్ని ఆదుకున్నావా? ఒక్క బాధిత కుటుంబాన్ని పరామర్శించావా?
అధికారంలోకి వచ్చాక, షరతులు వర్తిస్తాయంటూ అంటూ ఒక బిడ్డకే అని అర్ధ ఒడి చేశాడు. రూ.15 వేలు ఇస్తానని అన్నాడు. మెయింటెనెన్స్ పేరుతో రూ.2 వేలు కోసి రూ.13 వేలు ఇస్తాను అన్నాడు. ఇప్పుడు డబ్బులు లేకుండానే బటన్ నొక్కాడు. నెల రోజులు అవుతున్నా డబ్బులు పడటం లేదు.
పిల్ల సైకోల కక్కుర్తి వలన గుండ్లకమ్మ నదిపై ఆధారపడిన 13 గ్రామాల మత్స్యకారులు రోడ్డున పడ్డారు. సెంటు స్థలాల్లో భారీ స్కాం చేశారు పిల్ల సైకోలు. ఎకరం రూ.10 లక్షలకు కొని ప్రభుత్వానికి రూ.27 లక్షలకు అమ్మేశారు.
దేవుడ్ని కూడా వదలలేదు. సింగరకొండ పుణ్యక్షేత్రంలో కాంట్రాక్టు పోస్టుల దగ్గర నుండి, షిఫ్ట్ ఆపరేటర్, వాచ్ మన్, అంగన్వాడీ పోస్టుల వరకూ ప్రతి ఉద్యోగానికి ఒక రేటు పెట్టి అమ్మేస్తున్నారు పిల్ల సైకోలు. గ్రానైట్ యజమానులను బెదిరించి లారీకి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు పిల్ల సైకోలు.
జగన్ పనైపోయింది. 2024లో గెలిచేది టీడీపీనే. అద్దంకిలో భారీ మెజారిటీతో మన పులి రవి గారిని గెలిపించండి. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలుపుతాం. వైవీ సుబ్బారెడ్డి గారి తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన పోలిరెడ్డి కొరిశపాడు లిఫ్ట్ ప్రాజెక్ట్ జగన్ పూర్తి చెయ్యలేదు. టీడీపీ గెలిచిన వెంటనే ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం.
ఆపేసిన భవనాశి రిజర్వాయర్ పనులు పూర్తిచేస్తాం. వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. గుండ్లకమ్మ బ్రిడ్జ్ పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. కొత్త బ్రిడ్జ్ నిర్మిస్తాం. గుండ్లకమ్మ ప్రాజెక్టు ముంపు గ్రామల ప్రజలకు అన్ని మౌలిక వసతులతో కాలనీలు ఏర్పాటు చేస్తాం.
మన పులి ఎక్కడా తగ్గలేదు
అద్దంకి ప్రజల కోసం పోరాడినందుకు రవి గారిని వేధించారు. సమస్యలు పరిష్కరించమని ప్రశ్నించినందుకు వెంటాడారు. అయినా మన పులి తగ్గుతుందా? ఒక్కటే చెప్పాడు...
ఫ్లూటు జింక ముందు ఊదు... పులి ముందు కాదని. వైసీపీ ఇప్పటికే వెంటిలేటర్ పై ఉంది... ఇలాంటి పరిస్థితుల్లోనూ వైసీపీ నేతలు సవాళ్లు విసరడం సిల్లీగా ఉంది.