Nara Lokesh: ​నియంతకు, నాయుడు​ గారికి తేడా అదే!: నారా లోకేశ్

Lokesh make a comparison between Jagan and Chandrababu Naidu

  • అద్దంకి నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
  • పాత బస్టాండు సెంటర్ లో భారీ బహిరంగ సభ
  • జగన్ ఇసుక తింటున్నాడంటూ సెటైర్లు
  • టీడీపీ మేనిఫెస్టోలోని అంశాల ప్రస్తావనతో ప్రసంగం
  • ఉమ్మడి ప్రకాశం జిల్లా అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అంటూ సవాల్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర అద్దంకిలో జనసంద్రంగా మారింది. 170వ రోజు అద్దంకి పాతబస్టాండు సెంటర్ లో నిర్వహించిన బహిరంగసభకు నియోజకవర్గం నలుమూలల నుంచి జనం పోటెత్తారు. 

అద్దంకి మధురానగర్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర... రామ్ నగర్, అంబేద్కర్ విగ్రహం, పాతబస్టాండు, భవానీసెంటర్, గుండ్లకమ్మ బ్రిడ్జి, తిమ్మాయపాలెం మీదుగా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. దర్శి అసెంబ్లీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు యువనేతకు ఘనస్వాగతం పలికారు. 

అద్దంకి సభలో లోకేశ్ ప్రసంగం హైలైట్స్

జగన్ ఇసుక తింటున్నాడు!

జగన్ రోజూ ఏం తింటాడు? ఆప్షన్ 1. బిర్యానీ, ఆప్షన్ 2. అన్నం, ఆప్షన్ 3. ఇసుక. రాష్ట్రంలో పందికొక్కులా ఇసుక తింటుంది ఎవరు? 

టీడీపీ హయాంలో ట్రాక్టర్ ఇసుక ఎంత... రూ.1500, జగన్ హయాంలో ట్రాక్టర్ ఇసుక ఎంత... రూ.5000. రోజుకి ఇసుక దోపిడీలో జగన్ వాటా ఎంతో తెలుసా... రూ. 3 కోట్లు, నెలకి రూ.90 కోట్లు, సంవత్సరానికి రూ.1080 కోట్లు. ఐదేళ్లలో జగన్ ఇసుక ఆదాయం ఎంతో తెలుసా రూ.5,400 కోట్లు!

నాయుడు గారి పాలనలో అభివృద్ధి... నియంత పాలనలో విధ్వంసం. 

నాయుడు గారికి నియంతకి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసా? కియా, ఫ్యాక్స్ కాన్, హెచ్ సీఎల్... నాయుడు గారి బ్రాండ్లు... నియంత బ్రాండ్లు కోడి కత్తి, గొడ్డలి పోటు. పోలవరం, పట్టిసీమ నాయుడు గారి బ్రాండ్లు... నియంత బ్రాండ్లు ఏంటి? ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్. 

నాయుడు గారు ఏపీని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా చేస్తే... నియంత ఏపీని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చాడు. నాయుడు గారి పాలనలో పెట్టుబడులు... నియంత పాలనలో అప్పులు. నాయుడు గారి పాలనలో అభివృద్ధి... నియంత పాలనలో విధ్వంసం.

మహిళల కష్టాలు తీర్చేందుకే మహాశక్తి

2,200 కిమీ పాదయాత్రలో అనేక సమస్యలు విన్నాను, ప్రజల కష్టాలు చూశాను. అందుకే భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. 

మహాశక్తి పథకం కింద... 1) ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 

2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు. 

3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.

యువగళం పేరుతో నిరుద్యోగ భృతి ఇస్తాం

జగన్ యువత భవిష్యత్తు పై దెబ్బకొట్టాడు. యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలి అని జగన్ కోరుకుంటున్నాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. పాదయాత్ర సందర్భంగా యువత గళాన్ని విన్నాం. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. 

నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం.అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.

టీడీపీ గౌరవాన్ని నిలబెట్టింది మీరే!

ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు 2019లో టీడీపీ గౌరవాన్ని నిలబెట్టారు. 4 సీట్లు గెలిపించారు. 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఉమ్మడి ప్రకాశం జిల్లాని గుండెల్లో పెట్టుకొని అభివృద్ధి చేస్తాం. 2019లో వైసీపీ 8 సీట్లు గెలిచింది. టీడీపీ ఎమ్మెల్యేని కూడా పార్టీలో చేర్చుకున్నారు. 

మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే జిల్లా ఎలా అభివృద్ధి చెందాలి? అభివృద్ధిలో ఎంత దూసుకెళ్లి ఉండాలి? కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లాకి జగన్ ప్రభుత్వం పీకింది ఏమీ లేదు. ప్రాజెక్టులను అటకెక్కించాడు. 

ప్రకాశం అభివృద్ధిపై బహిరంగచర్చకు సిద్ధమా?

జగన్ గుండ్లకమ్మ ప్రాజెక్టును నాశనం చేశాడు. గేటు కొట్టుకుపోయింది. ప్రాజెక్టులోని నీరు మొత్తం ఖాళీ చేశారు. జగన్ అసమర్ధత కారణంగా గుండ్లకమ్మ ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. 12 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ఏషియన్‌ పల్ప్‌ అండ్‌ పేపర్‌ పరిశ్రమను తీసుకొస్తే జగన్ తన్ని తరిమేశాడు. అది వచ్చి ఉంటే ఇక్కడ సుబాబుల్, జామాయిల్ రైతులకు ఎంతో మేలు జరిగేది. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా అభివృద్ధి పై ఓపెన్ ఛాలెంజ్ నేను చర్చకు సిద్ధం. ఇద్దరు ఎంపీలు, 9 మంది ఎమ్మెల్యేలు సిద్ధమా? జగన్ పీకింది ఏంటో చెప్పే దమ్ముందా?

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2250 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 17.9 కి.మీ.*

*171వరోజు (31-7-2023) యువగళం వివరాలు*

*దర్శి అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడిప్రకాశం జిల్లా)*

సాయంత్రం

4.00 – వేంపాడు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.15 – వేంపాడులో స్థానికులతో సమావేశం.

5.15 – ముండ్లమూరులో బహిరంగసభ, యువనేత లోకేశ్ ప్రసంగం.

7.45 – పసుపుగల్లులో స్థానికులతో మాటామంతీ.

9.45 – ఉల్లగల్లులో స్థానికులతో సమావేశం.

11.00 – కెలంపల్లి శివారు విడిది కేంద్రంలో బస.

******

  • Loading...

More Telugu News