Bull Force: పగబట్టిన ఎద్దు.. చెట్టెక్కి రెండు గంటలు గడిపిన రైతు.. వీడియో ఇదిగో!

Akhilesh Yadav demands Bull Force In UP

  • ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాలో ఘటన
  • 12 మందిని గాయపర్చిన ఎద్దు
  • బుల్ ప్రొటెక్షన్ పోలీసులను ఏర్పాటు చేయాలన్న అఖిలేశ్ యాదవ్

ఎద్దు పగబట్టడంతో ఓ రైతు రెండు గంటలపాటు చెట్టుపై గడపాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రస్డా పోలీస్  స్టేషన్ పరిధిలో దారితప్పిన ఓ ఎద్దు ఇప్పటి వరకు 12 మందిని గాయపర్చింది. శుక్రవారం ఖఖ్నూ అనే రైతు వెంట పడింది. దాని బారినుంచి తప్పించుకునేందుకు రైతు పరిగెడుతూ రోడ్డుపక్కనున్న చెట్టు ఎక్కేశాడు. అయినప్పటికీ అది కదల్లేదు సరికదా.. అక్కడే అతడి కోసం కాపుకాసింది. దీంతో ఆ ఖఖ్నూ రెండు గంటలపాటు చెట్టుపైనే గడపాల్సి వచ్చింది.

ఈ ఘటనపై యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ స్పందించారు. ఇలాంటి ఎద్దులను అరికట్టేందుకు బుల్ ప్రొటెక్షన్ పోలీసులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ ప్రాంతంలో ఇప్పటివరకు ఇలా దారితప్పిన 3,910 ఎద్దులను సంరక్షణ కేంద్రాలకు తరలించామని పేర్కొన్నారు. కాగా, వీడియోలో రైతును భయపెట్టిన ఎద్దును పట్టుకునేందుకు ఓ బృందం రంగంలోకి దిగింది.

  • Loading...

More Telugu News