JD Chakravarthi: 'దయా'గా జేడీ చక్రవర్తి .. హాట్ స్టార్ ట్రాక్ పైకి వస్తున్న వెబ్ సిరీస్!

Dayaa Web Series Update
  • 'దయా'గా కనిపించనున్న జేడీ 
  • దర్శకత్వం వహించిన పవన్ సాధినేని
  • కీలకమైన పాత్రను పోషించిన ఈషా రెబ్బా
  • ఈ నెల 4 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్
జేడీ చక్రవర్తి తన కెరియర్లో ఫస్టు వెబ్ సిరీస్ గా 'దయా' చేశాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు. పవన్ సాధినేని ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించాడు. ఈ నెల 4వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. దాంతో అందుకు సంబంధించిన ప్రమోషన్స్ జోరందుకున్నాయి. 

ఈ వెబ్ సిరీస్ లో జేడీ కాస్త వినికిడి లోపం గల పాత్రలో .. ఒక వ్యాన్ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఒక రోజున అతని వ్యాన్ లో అతనికి తెలియకుండా ఎవరో ఒక శవాన్ని పడేసి వెళ్లిపోతారు. ఆ శవాన్ని చూసి కంగారు పడిపోయిన దయా, ఎవరికీ తెలియకుండా దానిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే అదే అతను చేసిన పొరపాటు అవుతుంది. 

ఆ శవం ఎవరిది? ఆ కేసులో దయా ఎలా చిక్కున్నాడు? అందులో నుంచి బయటపడటానికి ఆయన ఏం చేశాడు? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ ముందుకు వెళుతుంది. జేడీ చక్రవర్తి భార్య పాత్రలో ఈషా రెబ్బా నటించగా, రమ్య నంబీసన్ .. కమల్ కామరాజు .. జోష్ రవి .. యాంకర్ విష్ణుప్రియ ముఖ్యమైన పాత్రలను పోషించారు. 
JD Chakravarthi
Eesha Rebba
Kamal kamaraju
Dayaa

More Telugu News