Telangana: జేసీ ప్రభాకర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు
- బీఎస్3 వాహనాలను బీఎస్4గా మార్చి తప్పుడు రిజిస్ట్రేషన్లతో నడుపుతున్నారని అభియోగం
- జేసీ ప్రభాకర్ రెడ్డిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తాడిపత్రి ఎమ్మెల్యే
- ప్రభాకర్ రెడ్డి సహా పలువురికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు
జేసీ ప్రభాకర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. దివాకర్ ట్రావెల్స్ బీఎస్3 వాహనాలను బీఎస్4గా మార్చి తప్పుడు రిజిస్ట్రేషన్లతో నడుపుతున్నారని అభియోగాలు రావడంతో ప్రభాకర్ రెడ్డికి, తెలంగాణ రవాణా శాఖకు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సీబీఐ, డీజీపీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీరి ట్రావెల్స్‌పై తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తెలంగాణలో బీఎస్3 వాహనాలను అక్రమంగా నడుపుతున్నారని, ఏడాది క్రితం ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని పెద్దారెడ్డి పేర్కొన్నారు. బీఎస్3 వాహనాలను బీఎస్4గా తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వాహనాలను జఫ్తు చేసి సీబీఐతో దర్యాఫ్తు చేయించాలని కోరారు. పెద్దారెడ్డి పిటిషన్‌పై విచారణను కోర్టు సెప్టెంబర్ 12కు వాయిదా వేసింది.